Bollywood: షారుఖ్ ‘పఠాన్’ ట్రైలర్ వచ్చేసింది!

 Shah Rukh Khan Pathaan trailer out

  • ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ చిత్రం
  • షారుఖ్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొణే 
  • ఈ నెల 25వ తేదీన విడుదల కానున్న సినిమా

బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే జంటగా నటించిన ‘పఠాన్’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చాన్నాళ్లుగా సరైన హిట్ లేక డీలా పడ్డ షారుఖ్ ఈ సినిమాతో తిరిగి విజయాల బాటలోకి రావాలని చూస్తున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ చిత్రం ట్రైలర్ ను మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఫ్యాన్స్ కోరుకున్న రీతిలో షారుఖ్ తన మార్కు యాక్షన్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించారు. ఆయన లుక్ కూడా అదిరిపోయింది. విలన్ పాత్రలో జాన్ అబ్రహంతో పోటాపోటీ ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి. దీపికా పదుకొణే అందాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 


గతేడాది నవంబర్ లో ఈ చిత్రం టీజర్ విడుదలవగా.. ఆ తర్వాత బేషరమ్ పాటను చిత్ర బృందం వదిలింది. అయితే, ఈ పాట వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇందులో దీపిక అతిగా అందాల ప్రదర్శన చేయడంతో పాటు కాషాయ రంగు బికినీలో కనిపించడంతో ఓ వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. పఠాన్ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ కొన్ని రోజలుగా ఆందోళనలు సైతం జరుగుతున్నాయి.

Bollywood
Shahrukh Khan
pathan movie
Deepika Padukone

More Telugu News