Varalakshmi Sharath Kumar: వరల్డ్ ఆఫ్ 'శబరి' .. ఉత్కంఠను రేపుతున్న వీడియో!

 World of Sabari Video Release

  • 'శబరి'గా వరలక్ష్మి శరత్ కుమార్ 
  • సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • ఫిబ్రవరి 17వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ 
  • నాలుగు భాషల్లో విడుదలవుతున్న సినిమా

తెలుగు .. తమిళ భాషల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యమైన .. కీలకమైన పాత్రలతో పాటు, కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని నాయిక ప్రధానమైన పాత్రలను కూడా చేస్తూ వెళుతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శబరి' రెడీ అవుతోంది. 
 
ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో ఒక వీడియోను వదిలారు. ఒక ఫారెస్టు ఏరియాలో తన పాపను పెట్టుకుని 'శబరి' ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఒక రోజు రాత్రి ఒక ఒక ఆగంతుకుడు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 

అతని బారి నుంచి ఆమె తన కూతురిని ఎలా కాపాడుకుంది? ఇంతకీ అతను ఎవరు? అనే సందేహాలను రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. తెలుగుతో పాటు తమిళ ... మలయాళ .. హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు

Varalakshmi Sharath Kumar
Sabari Movie
Tollywood

More Telugu News