Kiran Abbavaram: 'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్ రిలీజ్!

Vinaro Bhagyamu Vishnu katha Movie Teaser Released

  • విభిన్నమైన కథా చిత్రంగా 'వినరో భాగ్యము విష్ణుకథ'
  • కిరణ్ అబ్బవరం జోడీగా కశ్మీర పరిచయం 
  • హైలైట్ గా నిలవనున్న మురళీశర్మ కామెడీ 
  • వచ్చేనెల 17వ తేదీన సినిమా రిలీజ్ 

కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకి మురళీ కిశోర్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాతో కశ్మీర కథానాయికగా పరిచయమవుతోంది.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగే 'విష్ణు' అనే యువకుడి ప్రేమకథ అనే విషయం టీజర్ ద్వారా అర్థమవుతోంది. అసలు కంటెంట్ ఏమిటనేది తరువాత చెబుతామంటూ టీజర్ ను కట్ చేసిన తీరు బాగుంది. కథలో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయని తెలుస్తోంది. 
   
ఇక మురళీశర్మతో వేయించిన బాలయ్య బాబు .. బన్నీ స్టెప్పులు చూస్తే కామెడీ ట్రాక్ ఒక రేంజ్ లో ఉండేలానే కనిపిస్తోంది. ఆమని .. శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 17వ తేదీన విడుదల చేయనున్నారు

Kiran Abbavaram
Kashmeera
Vinaro Bhagyamu Vishnu Katha Movie

More Telugu News