: మలేరియాకు కొత్త టీకా


మలేరియా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకుంటోంది. ప్రతి ఏటా సుమారు 6.50 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. మలేరియా వ్యాధిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో జపాన్‌ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ వ్యాధి తీవ్రతను తగ్గించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఒక కొత్త టీకాను అభివృద్ధి చేశారు.

జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మలేరియా పరాన్నజీవి (ప్యారాసైట్‌)లోని జన్యుమార్పిడి ప్రొటీన్‌, అల్యూమినియం హైడ్రాక్సిల్‌జెల్‌తో కలిపి ఈ కొత్తరకం టీకాను అభివృద్ధి చేశారు. ఈ పొడి టీకాను ‘బీకే`ఎస్‌ఈ36’ అని పిలుస్తున్నారు. ఈ టీకా మలేరియా వ్యాధి వ్యాప్తిని 75 శాతం అరికడుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ తొషిహిరో హొర్రి తెలిపారు.

  • Loading...

More Telugu News