Samanta: బన్నీని గుణశేఖర్ భలేగా ఒప్పించాడు: దిల్ రాజు

Shaakuntalam Trailer launch Event

  • 'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ ఈవెంటులో దిల్ రాజు
  • ఇది గుణశేఖర్ మూడేళ్ల కష్టమని వ్యాఖ్య 
  • సమంత ఎమోషనల్ జర్నీ హైలైట్ అని వెల్లడి 
  • అల్లు అర్హ ప్రత్యేక ఆకర్షణ అంటూ వివరణ

సమంత టైటిల్ రోల్ ను పోషించిన 'శాకుంతలం' విడుదలకు ముస్తాబవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, వచ్చేనెల 17వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ  నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ .. "గుణశేఖర్ గారి మూడేళ్ల కష్టం 'శాకుంతలం'. ఈ సినిమా కోసం ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది నాకు తెలుసు" అన్నారు. 

సమంత విషయానికొస్తే కథ వినగానే ఆమె ఓకే అన్నారు. కానీ విజువలైజేషన్ కి ఆమెకి కొంత సమయం పట్టింది. స్క్రీన్ పై చూసిన తరువాత ఆమె హ్యాపీగా ఫీలైంది. డైరెక్టర్ ఏం చెప్పారో అదే తీశారు అంటూ కాల్ చేసింది. ఈ సినిమాలో సమంత ఎమోషనల్ జర్నీ బ్యూటిఫుల్. దుష్యంతుడిగా శకుంతల పాత్రకి కావలసిన సపోర్టును దేవ్ మోహన్ ఇచ్చాడు. 

ఇక 'బాల భరతుడు' పాత్రను ఎవరితో చేయించాలనే ఆలోచన వచ్చింది. గుణశేఖర్ గారు మెల్లగా బన్నీ దగ్గరికి వెళ్లి .. ఆయనను పటాయించేసి .. 'అర్హా' చేయడానికి పర్మిషన్ తీసుకుని వచ్చేశారు. అది డైరెక్టర్ గారి క్రెడిట్. భరతుడి పాత్రలో అల్లు అర్హ చేయడం కూడా ఈ సినిమాకి మంచి ఎలిమెంట్. నేను 'వారసుడు'.. చరణ్ - శంకర్ లతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐదు లాంగ్వేజెస్ లో చేసిన ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా ఇది.  అందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా సమంత .. గుణశేఖర్ లకు మాత్రమే చెందుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.

Samanta
Dev Mohan
Dil Raju
Gunasekhar
Shakunthalam Movie
  • Loading...

More Telugu News