JC Prabhakar Reddy: మామూళ్లు ఇవ్వలేదని బలపం పౌడర్ పరిశ్రమలను మూసేయించారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ysrcp leaders are doing dadagiri says JC Prabhakar Reddy
  • చంద్రబాబునే కుప్పంలో తిరగనీయలేదన్న జేసీ
  • తనను తాడిపత్రి వార్డుల్లో తిరగనీయకపోవడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్య
  • ప్రతి ఒక్కడూ దాదాగిరి చేస్తున్నాడని మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ప్రభుత్వం తిరగనీయనప్పుడు... తాడిపత్రిలోని మున్సిపల్ వార్డుల్లో తనను తిరగనీయకపోవడం పెద్ద విషయమేమీ కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కడూ దాదాగిరి చేస్తున్నారని... టైమ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకుందామని అనుకుంటున్నారని.. మామూళ్లు ఇవ్వలేకే బ్రిటీష్ కాలం నుంచి ఉన్న రాయలచెరువులోని బలపం పౌడర్ ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయని చెప్పారు. ఫ్యాక్టరీల ఓనర్లు మాత్రం ఎంతని ఇస్తారని అన్నారు. చాలా మంది ఫ్యాక్టరీల ఓనర్లు నష్టాల్లో ఉన్నారని అన్నారు. తననే రోడ్లపైకి వెళ్లొద్దని చెపుతున్నప్పుడు, ఫ్యాక్టరీల ఓనర్లు ఎంతని ప్రశ్నించారు. యథారాజా తథాప్రజ అని చెప్పారు.
JC Prabhakar Reddy
Telugudesam
Chandrababu

More Telugu News