AP Govt: విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్... సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court issues notices to Telangana and Central Govt

  • ఆస్తుల విభజన సరిగా జరగలేదన్న ఏపీ ప్రభుత్వం
  • న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్
  • గైర్హాజరైన తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు
  • తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తుల పంపకాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆస్తుల విభజన సరిగా జరగక ఆర్థికంగా నష్టపోయామంటూ ఏపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. 

అయితే నేటి విచారణకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, సుప్రీం ధర్మాసనం తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు, కౌంటర్ పై రిజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

AP Govt
Bifurcation
Andhra Pradesh
Telangana
Central Govt
Supreme Court
Notice
  • Loading...

More Telugu News