Vijayasai Reddy: రాజధాని విశాఖలో స్థిరపడాలనుకుంటున్న చిరంజీవికి హృదయపూర్వక స్వాగతం: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy welcomes Chiranjeevi to settle down in executive capital Visakha

  • విశాఖ వేదికగా నిన్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక
  • విశాఖలో ఇల్లు కట్టుకుంటానన్న చిరంజీవి
  • భీమిలి రోడ్ లో స్థలం కొనుక్కున్నానని వెల్లడి
  • వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించాలన్న విజయసాయిరెడ్డి

విశాఖపట్నంలో నిన్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడ్నవుతానని వెల్లడించారు. భీమిలి రోడ్ లో స్థలం కొనుక్కున్నానని, త్వరలోనే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. 

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు. చిరంజీవి కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. చిరంజీవి ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా తన ట్వీట్ కు జతచేశారు.

More Telugu News