Samantha: అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటున్న 'శాకుంతలం' ట్రైలర్!

Shaakuntalam Trailer Released

  • సమంత ప్రధానమైన పాత్రగా రూపొందిన 'శాకుంతలం'
  • ఈ సినిమాతో మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయం
  • కనులవిందు చేస్తున్న కమనీయ దృశ్యాలు  
  • సమంత కెరియర్లో నిలిచిపోయే సినిమానే  
  • ఫిబ్రవరి 17న పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్  

గుణశేఖర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఆడియన్స్ లో సహజంగానే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆయన ఎంచుకుంటూ వస్తున్న కథలే అందుకు ప్రధానమైన కారణం. ఇక చారిత్రక .. పౌరాణిక చిత్రాల రూపకల్పన విషయంలో ఆయనకి గల అనుభవం కూడా మరో కారణం. అందువలన ఆయన దర్శకత్వంలో రూపొందిన 'శాకుంతలం' కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున అడవిలో శకుంతల ఆశ్రమవాసం .. మరో వైపున రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం .. ప్రేమ .. వివాహం .. విరహం .. దుర్వాసుడి శాపం .. భరతుడి జననం వరకూ ఈ ట్రైలర్ లో చూపించేశారు. అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాతో, మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయమవుతున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి నటించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని గుణశేఖర్ చెబుతున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు

Samantha
Dev Mohan
Mohan Babu
Prakash Raj
Shaakuntalam Movie

More Telugu News