Cheetah: వందే భారత్ ఎక్స్ ప్రెస్ వేగంతో పరుగెడుతున్న చిరుత
- వేటాడేందుకు గంటకు 112 కిలోమీటర్ల వేగంతో పరుగు
- ఒక్క అంగకే 22 అడుగుల దూరం జంప్
- దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ‘ఫ్యాసినేటింగ్’
చీతా (చిరుతపులి/అసినోనిక్స్ జుబాటస్ జాతికి చెందినది) కు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా గుర్తింపు ఉంది. వేటాడడంలో దీనికి మించిన జంతువు లేదు. నేలపై జంతువు అయినా, నీటిలోని మొసలి అయినా, గురి చూసి కొట్టిందంటే దానికి స్వాధీనం అయిపోవాల్సిందే. తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వదు. ఎంత సమయం పాటు అయినా పరుగెత్తి పట్టుకోగలదు. ఆయాసపడి మధ్యలో ఆగిపోవడం తెలియని జంతువు. దీని శరీర నిర్మాణం అంత ప్రత్యేకం.
అలాంటి ఒక చీతా ఆహారం కోసం జంతువును వేటాడుతూ అతి వేగంగా పరుగెత్తడాన్ని ఎవరో వీడియో తీశారు. దీన్ని ఫ్యాసినేటింగ్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సాధారణంగా చిరుత పులులు గంటకు 60 మైళ్ల దూరం వేగంతో పరుగెత్తుతుంటాయి. ఒక మైలు అంటే 1.60 కిలోమీటర్లు. అయితే ఇదేమీ గరిష్ఠ పరిమితి కాదు. అవసరమైతే కోరుకున్న జంతువును ఆరగించేందుకు తన వేగాన్ని మరింత పెంచగలదు. ఈ వీడియోలోని చిరుత ఏకంగా గంటకు 70 మైళ్ల వేగంతో పరుగెత్తింది. అంటే 112 కిలోమీటర్ల వేగం. ఓ రైలు వేగానికి సమానంగా పరుగెత్తినట్టు. ఒక్కో అంగ 22 అడుగుల దూరం ఉందంటే దీని బలం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి ఈ వీడియోను 33 లక్షల మంది చూశారు.