Eesha Rebba: హాట్ బ్యూటీ ఈషా రెబ్బా .. లేటెస్ట్ పిక్స్!

Eesha Rebba Special

  • తెలుగు బ్యూటీగా ఈషా రెబ్బా 
  • హాట్ లుక్స్ తో ఆకట్టుకున్న సుందరి 
  •  సరైన బ్రేక్ కోసం వెయిటింగ్ 
  • తమిళ .. మలయాళ సినిమాలపైనా దృష్టి 

తెలుగు సినిమాలలో తెలుగు అమ్మాయిగా అవకాశాలు దక్కించుకోవడం అనుకున్నంత తేలికేం కాదు. ఇక్కడ ఇతర భాషల నుంచి వచ్చే అందగత్తెల నుంచి గట్టి పోటీ ఉంటుంది. అందువలన ఇక్కడ నెగ్గుకు రావడం చాలా కష్టమైన విషయం. అయినా ఈ విషయంలో పట్టుదలతో మరో నాలుగు అడుగులు ముందుకేసి తెలుగు కథానాయికలలో అంజలి తరువాత స్థానంలో ఈషా రెబ్బా కనిపిస్తుంది. వరంగల్ నుంచి ఇండస్ట్రీలో దిగిపోయిన ఈషా, ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంది. చక్కని కనుముక్కుతీరు .. మంచి హైట్ .. అందుకు తగిన రూపం .. హాట్ లుక్స్ తో ఈషా కుర్రకారు మనసులను కొల్లగొట్టేసింది. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు .. చిన్న సినిమాల్లో నాయిక పాత్రలు వేస్తూ తన కెరియర్ ను నడిపించింది. అందం .. అభినయం విషయంలో వంకబెట్టనవసరం లేదు కానీ, అదృష్టమే ఆమెతో దోబూచులాడుతోంది. దాంతో తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూనే, తమిళ .. మలయాళ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె లేటెస్ట్ పిక్స్ వదిలారు. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్ లో ఆమె మంచి ఫిట్ నెస్ తో మరింత అందంగా కనిపిస్తోంది. సరైన సినిమా పడితే ఈషా దశ తిరిగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి సమయం కోసమే ఆమె కూడా వెయిట్ చేస్తోంది మరి.!

Eesha Rebba
Actress
Tollywood
  • Loading...

More Telugu News