Singireddy Niranjan Reddy: మోదీ తెలంగాణలో పోటీ చేస్తానని అంటున్నారట: మంత్రి నిరంజన్ రెడ్డి

Telangana ministers comments on Modi

  • ప్రధాని మోదీని టార్గెట్ చేసిన తెలంగాణ మంత్రులు
  • మోదీ తెలంగాణలో పోటీ చేస్తే ఓడిస్తామన్న నిరంజన్ రెడ్డి
  • కేసీఆర్ పేరు వింటేనే మోదీకి మంట అన్న జగదీశ్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రులు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా మోదీ పైశాచికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోదీ తెలంగాణలో పోటీ చేస్తానని అంటున్నారట అని వెల్లడించారు. మోదీ తెలంగాణలో పోటీ చేస్తే ఓడిస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 

మరో మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ, కేసీఆర్ పేరు వింటేనే మోదీకి మంట అని వ్యాఖ్యానించారు. మోదీ చెప్పేవన్నీ దొంగమాటలేనని అన్నారు. తెలంగాణను అంధకారంలోకి నెట్టాలని ప్రధాని సహా కేంద్రమంత్రులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇక, కేసీఆర్ నాయకత్వం ఏపీలో కూడా ఉంటే బాగుంటుందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ అంటే ఏపీ వాళ్లకు గిట్టదని ప్రచారం చేసేవాళ్లకు, ఇటీవల ఏపీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చెంపపెట్టు వంటిదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 

నల్గొండ జిల్లా చౌళ్ల రామారం గ్రామం వద్ద నిర్మించిన వేర్ హౌసింగ్ గోడౌన్లను ఇవాళ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News