Chiranjeevi: ''రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు .. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి'' అంటున్న 'వాల్తేరు వీరయ్య'.. ట్రైలర్ రిలీజ్

Waltair Veerayya Trailer Released

  • 'వాల్తేరు వీరయ్య'గా కనిపించనున్న చిరంజీవి
  • జాలరిగూడెం నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన దేవిశ్రీ మాస్ బీట్స్ 
  • ఈ నెల 13వ తేదీన విడుదలవుతున్న సినిమా  

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మాస్ బీట్స్ కి మరిన్ని మార్కులు పడిపోయాయి. 

చిరంజీవి సరసన నాయికగా శ్రుతి హాసన్ నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ మార్క్ యాక్షన్ .. కామెడీ .. రొమాన్స్ .. మాస్ స్టెప్పులు .. పవర్ఫుల్ డైలాగ్స్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రధానమైన పాత్రలన్నిటినీ రివీల్ చేస్తూ ఆసక్తిని రేకెత్తించారు.

 
'మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయనను చూసి' .. 'మీ కథలోకి నేను రాలా .. నా కథలోకే మీరంతా వచ్చారు' .. 'రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు .. నా పేరుమీదే రికార్డ్స్ ఉంటాయి" అనే డైలాగ్స్ ట్రైలర్ కి హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలు పెంచే విషయంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.   

ఇది విశాఖలోని ఒక జాలరి గూడెం నేపథ్యంలో నడిచే కథ. ఆ గూడెం ప్రజల తరఫున నిలబడి, అవినీతినీ .. అన్యాయాన్ని ప్రశ్నించే నాయకుడిగా చిరంజీవి పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నారు. రవితేజ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, కేథరిన్ .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.

Chiranjeevi
Sruthi Haasan
Devisri Prasad
Waltair Veerayya Movie

More Telugu News