Rishabh Pant: పంత్ మోకాలికి శస్త్రచికిత్స విజయవంతం

Rishabh Pant successfully underwent knee surgery in Mumbai

  • ఇటీవల రోడ్డు ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు
  • తెగిపోయిన మోకాలి లిగమెంట్
  • డెహ్రాడూన్ నుంచి ముంబయికి ఎయిర్ లిఫ్ట్
  • ముంబయి కోకిలాబెన్ ఆసుపత్రిలో పంత్ కు సర్జరీ

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం పంత్ ను డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. 

కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్ లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్ ను ముంబయికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంత్ మోకాలికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించారని, సర్జరీ విజయవంతమైందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సర్జరీ అనంతర చికిత్సపై డాక్టర్ దిన్ షా పార్థీవాలా, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీమ్ సలహాలను పాటిస్తామని తెలిపింది. 

పంత్ గత నెలలో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా, జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టిన కారు మంటల్లో చిక్కుకుంది. హర్యానా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సిబ్బంది సకాలంలో పంత్ ను కారు నుంచి బయటికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది.

Rishabh Pant
Knee Surgery
Mumbai
Road Accident
BCCI
Team India
  • Loading...

More Telugu News