Tulasi Reddy: సలహాదారులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుంటుంది: తులసిరెడ్డి
- వాళ్లు సలహాదారులు కాదు.. స్వాహాదారులన్న తులసిరెడ్డి
- జగన్ కు నచ్చిన వాళ్లకు దోచిపెట్టే పథకం అని విమర్శ
- సలహాదారుల పేరిట కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం సరికాదని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వ సలహాదారులపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వీరు సలహాదారులు కాదని, స్వాహాదారులని అన్నారు. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చెప్పారు. జగన్ కు కావాల్సిన వాళ్లకు దోచిపెట్టే పథకమని అన్నారు.
ఓపక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారుతుంటే... సలహాదారుల పేరిట కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం సరికాదని చెప్పారు. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. సలహాదారులు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేస్తే బాగుంటుందని అన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని... దీంతో వాళ్లు దొంగలుగా మారుతున్న పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.