Vikram: విక్రమ్ తాజా చిత్రంగా 'తంగాలన్' .. మేకప్ కోసమే నాలుగు గంటలు పడుతోందట!

Vikram Thangalan Movie Update

  • విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన 'తంగాలన్'
  • స్వాతంత్య్రం రాకముందు నడిచే కథ 
  • గిరిజన యువకుడిగా కనిపించనున్న విక్రమ్ 
  • కథనాయికలుగా పార్వతీ మీనన్ .. మాళవిక మోహనన్

విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించడంలో విక్రమ్ ముందే ఉంటారు. పాత్రలకి న్యాయం చేయడం కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా .. తెరపై ఎలా కనిపించడానికైనా ఆయన వెనుకాడరు. అలాంటి విక్రమ్ తాజా తమిళ చిత్రంగా 'తంగాలన్' రూపొందుతోంది. 

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకి, పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పట్లో 'నరాచీ' ప్రాంతంలో దళితులపై జరిగిన మారణకాండ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో విక్రమ్ పొడవైన గుబురు గెడ్డం .. గోచీగుడ్డతో కనిపించనున్నాడు. చెవికి పోగులు .. చేతిలో కర్ర .. ముంజేతికి కడియంతో కనిపించనున్నాడు. ఈ  పాత్రకి సంబధించిన మేకప్ కోసం ఆయనికి 4 గంటల సమయం పడుతోందట. అంతసేపు ఓపికగా కూర్చోవటం ఆయన సహనానికి నిదర్శనమని అంటున్నారు. పార్వతీ మీనన్ .. మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vikram
Thangalan Movie
Kollywood
  • Loading...

More Telugu News