Balakrishna: 'వీరసింహారెడ్డి'లో హైలైట్స్ ఏమిటంటే ..!: దునియా విజయ్

Duniya Vijay Interview

  • 'వీరసింహారెడ్డి'గా బాలకృష్ణ 
  • ఆయనతో తలపడే విలన్ గా దునియా విజయ్ 
  • బాలయ్యది గొప్ప మనసు అంటూ కితాబు 
  • ఆయన సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అదృష్టమని వెల్లడి 

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమా చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లకు రానుంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా కన్నడ స్టార్ దునియా విజయ్ కనిపించనున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో దునియా విజయ్ మాట్లాడుతూ .. "నా ఫ్రెండ్స్ లో చాలామంది తెలుగువారు ఉన్నారు. అందువలన నేను తెలుగు బాగానే మాట్లాడతాను. బాలకృష్ణగారి 'వీరసింహారెడ్డి' సినిమాతో తెలుగు తెరకి పరిచయం కావడం ఆనందంగా ఉంది. బాలయ్య బాబు మనసు నిజంగా బంగారమే. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న తీరు ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఏ అంశాన్ని తీసుకున్నా హైలైట్ గానే అనిపిస్తుంది. ఈ సినిమాను నేను .. బాలయ్య బాబు ప్రత్యక్షంగా తలపడతాము. మా ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ గానే అనిపిస్తాయి. అలాగే గోపీచంద్ మలినేని టేకింగ్ కూడా హైలైట్ గా నిలుస్తుంది. ఇక బాలయ్య బాబు మార్కు డైలాగ్స్ .. మాస్ డాన్సుల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? అంటూ నవ్వేశారు.

Balakrishna
Sruthi Haasan
Duniya Vijay
Veerasimha Reddy
  • Loading...

More Telugu News