KTR: సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ.. ఏ విషయంపై చర్చించామో చెప్పిన మంత్రి

Satya Nadella meets KTR

  • ఇండియాలో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల
  • ఇద్దరు హైదరాబాదీల కలయికతో ఈరోజు గొప్పగా ప్రారంభమయిందన్న కేటీఆర్
  • బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నామన్న మంత్రి

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు వచ్చిన ఆయనతో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్నేహపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు. ఇద్దరు హైదరాబాదీల కలయికతో ఈరోజు గొప్పగా ప్రారంభమయిందని ఆయన అన్నారు. బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. 

సత్య నాదెళ్ల హైదరాబాద్ లోనే పెరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, హైదరాబాద్ లో అవకాశాలు తదితర అంశాలను సత్య నాదెళ్లకు కేటీఆర్ వివరించినట్టు సమాచారం. లేటెస్ట్ టెక్నాలజీపై కూడా ఇరువురూ చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీతో నిన్న సత్య నాదెళ్ల భేటీ అయ్యారు.

KTR
TRS
Satya Nadella
Microsoft

More Telugu News