Police: ఇలాంటి బూటకపు వార్తలను నమ్మవద్దు: ఏపీ పోలీసు విభాగం

Police dept says do not believe in fake news

  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • నిన్న ఉద్రిక్తతలు
  • చంద్రబాబును అరెస్ట్ చేస్తారంటూ వాట్సాప్ లో ప్రచారం
  • ఖండించిన పోలీసు విభాగం

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో నిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వాట్సాప్ లో ఇవాళ ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్న ఓ వార్తపై ఏపీ పోలీసు విభాగం స్పందించింది. విపక్షనేత చంద్రబాబును కుప్పంలో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్నదే ఆ వాట్సాప్ వార్త సారాంశం. అయితే ఈ వార్తలో ఎలాంటి వాస్తవంలేదని ఏపీ పోలీసు విభాగం స్పష్టం చేసింది. ఇలాంటి బూటకపు వార్తలను నమ్మవద్దని సూచించింది. 

కాగా, కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబు పర్యటన రేపు (జనవరి 6) ముగియనుంది. తన పర్యటన చివరి రోజున టీడీపీ అధినేత గూడుపల్లి మండలంలోని గ్రామాల్లో పర్యటించనున్నారు.

Police
Fake News
Whatsapp
Chandrababu
Arrest
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News