Team India: 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

Team India in deep troubles in 2nd T20 against Sri Lanka
  • పూణేలో రెండో టీ20
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసిన లంక
  • లక్ష్యఛేదనలో టీమిండియా విలవిల
పూణేలో టీమిండియా కష్టాల్లో పడింది. శ్రీలంకపై 207 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 57 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 2, మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 5, కొత్త ఆటగాడు రాహుల్ త్రిపాఠి 5 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పోరాటం 12 పరుగులకే ముగిసింది. 9 పరుగులు చేసిన దీపక్ హుడా సైతం పెవిలియన్ చేరడంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 

ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (14 బ్యాటింగ్), అక్షర్ పటేల్ ఉన్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 65 బంతుల్లో 150 పరుగులు చేయాలి. లంక బౌలర్లలో కసున్ రజిత 2, మధుశంక 1, చామిక కరుణరత్నే, హసరంగ 1 వికెట్ తీశారు.
Team India
Sri Lanka
2nd T20
Pune

More Telugu News