Geetha Sakshiga: 'గీత సాక్షిగా' చిత్రం నుంచి 'అడుగులో...' సాంగ్ ప్రోమో విడుదల

Adugulo Adugune song promo released

  • ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా గీత సాక్షిగా
  • ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వంలో చిత్రం
  • రేపు సాయంత్రం 5 గంటలకు పూర్తి పాట రిలీజ్
  • జనవరి 26న ప్రేక్షకుల ముందుకు గీత సాక్షిగా చిత్రం

ఆదర్శ్, చిత్రా శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించిన చిత్రం గీత సాక్షిగా. ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి "అడుగులో..." అంటూ సాగే గీతం రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం నేడు పంచుకుంది. 

ఈ పాటకు గోపీసుందర్ బాణీలు అందించగా, రెహ్మాన్ సాహిత్యం సమకూర్చారు. అమృత సురేశ్, శ్రీకృష్ణ ఆలపించారు. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై చేతన్ రాజ్ నిర్మిస్తున్న గీత సాక్షిగా చిత్రంలో జయలలిత, భరణి శంకర్, రాజా రవీంద్ర, అనితా చౌదరి తదితరులు కూడా నటించారు. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Geetha Sakshiga
Adugulo Adugune
Song promo
Adarsh
Chitra Sukla
Anthony Mattipalli

More Telugu News