Santhosh Sobhan: అనుష్క చేతుల మీదుగా రిలీజైన 'కల్యాణం కమనీయం' ట్రైలర్

Kalyanam Kamaneeyam Trailer Released

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'కల్యాణం కమనీయం'
  • సంతోష్ శోభన్ జోడీగా ప్రియా భవాని శంకర్
  • సంగీతాన్ని సమకూర్చిన శ్రావణ్ భరద్వాజ్ 
  • ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల 

సంతోష్ శోభన్ - ప్రియా భవాని శంకర్ జంటగా 'కల్యాణం కమనీయం' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టైటిల్ వినగానే, ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ అనే విషయం తెలిసిపోతూనే ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందనే సంగతి అర్థమైపోతూనే ఉంది. 

అలాంటి ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. అనుష్క చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. ఎమోషన్ .. కామెడీ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  

భర్తకి ఉద్యోగం లేకపోవడం వలన భార్య ఫీల్ కావడం .. భార్య జాబ్ చేస్తుంది కదా అని భర్త ఆ విషయాన్ని లైట్ తీసుకోవడం .. అదే వారిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించడం ఈ కథలో ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. భారీ సినిమాల మధ్య థియేటర్లకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి

More Telugu News