Balakrishna: ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్చుకున్న 'వీరసింహా రెడ్డి' .. ఎక్కడంటే!

Veera Simha Reddy Movie Update

  • 'వీరసింహా రెడ్డి'గా బాలకృష్ణ 
  • ఈ నెల 6న జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్
  • ఒంగోలు పట్టణంలో మరో వేదికను సెట్ చేసిన టీమ్ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల

మాస్ యాక్షన్ సినిమాలను జనరంజకంగా తెరకెక్కించడంలో తనదైన ప్రత్యేకత ఎలా ఉంటుందనేది దర్శకుడు గోపీచంద్ మలినేని నిరూపించాడు. అలా ఆయన రూపొందించిన సినిమానే 'వీరసింహారెడ్డి'. బాలకృష్ణ హీరోగా .. ఆయన జోడీగా శ్రుతి హాసన్ నటించిన సినిమా ఇది. మొదటిసారిగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఒంగోలు లోని 'ఎ.బి.ఎమ్ కాలేజ్ గ్రౌండ్ 'లో, ఈ నెల 6వ తేదీన నిర్వహిస్తున్నట్టుగా రెండు రోజుల క్రితమే ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఆ నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. అందువలన వేదికను అక్కడి నుంచి అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్'కి మార్చారు. 

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఒంగోలులోని ఈ ప్రదేశంలో ఈ నెల 6వ తేదీ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. శ్రుతి హాసన్ కథానాయికగా .. ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. 

Balakrishna
Sruthi Haasan
Duniya Vijay
Veerasimha Reddy Movie
  • Loading...

More Telugu News