Nithin: ఆ ప్రాజెక్టు విషయంలో నితిన్ మనసు మార్చుకున్నాడంటూ టాక్!

Nithin in Venky Kudumula Movie

  • వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ 
  • 'మాచర్ల' ఫ్లాపుతో మారిన ఆలోచన 
  • వక్కంతం ప్రాజెక్టు వాయిదా అంటూ టాక్ 
  • వెంకీ కుడుములతో సినిమా ముందుకు అంటూ ప్రచారం

నితిన్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఆయనకి సక్సెస్ లు .. ఫ్లాపులు అలవాటే. నితిన్ ఎప్పటికప్పుడు యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చకచకా కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు అందకపోవడమే ఆయనను నిరాశపరుస్తోంది. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' కూడా పరాజయంపాలైంది. 

ఈ నేపథ్యంలో నితిన్ ఆలోచనలో పడినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. నిజానికి నితిన్ నెక్స్ట్ మూవీ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఉండనుంది. ఆ మధ్య మారేడుమిల్లిలో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు కూడా. ఆ తరువాతనే ఈ ప్రాజెక్టులో కదలిక లేకుండా పోయింది. అందుకు కారణం నితిన్ మనసు మార్చుకోవడమేనని అంటున్నారు. 

వక్కంతం వంశీతో సినిమా తరువాత వెంకీ కుడుములతో నితిన్ సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ ముందుగా వెంకీ ప్రాజెక్టుని పూర్తిచేయాలనే ఒక ఆలోచనతోనే నితిన్ ముందుకు వెళుతున్నాడని అంటున్నారు. గతంలో నితిన్ కి వెంకీ కుడుముల 'భీష్మ'తో హిట్ ఇచ్చాడు. ఆ తరువాత ఇంతవరకూ నితిన్ కి హిట్ లేదు. అందువల్లనే నితిన్ ఆయనకి ప్రాధాన్యతనిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.

Nithin
Vakkantham vamsi
Venky Kudumula
  • Loading...

More Telugu News