Mahesh Babu: ఏకధాటిగా 60 రోజులపాటు షూటింగులో పాల్గొననున్న మహేశ్ బాబు!

Mahesh and Trivikram movie update

  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు 
  • త్వరలో మొదలుకానున్న షూటింగు 
  • ఉగాది రోజున రానున్న ఫస్టు అప్ డేట్ 
  • ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన 

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లోని సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 28వ సినిమా. హారిక - హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లోని మూడో సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే కొంతకాలంగా మహేశ్ బాబు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ వస్తున్నాడనేది తెలిసిందే. అందువలన ఈ సినిమా షూటింగు వాయిదా పడుతూ వెళుతోంది. ఇక త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఆగస్టులో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా కోసం ఒక మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా వినికిడి. ఈ షెడ్యూల్ షూటింగు నాన్ స్టాప్ గా 60 రోజుల పాటు జరుగుతుందట. సినిమాకి సంబంధించిన ఫస్టు అప్ డేట్ ఉగాదికి ఇస్తారని టాక్. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News