SS Rajamouli: లాస్ ఏంజెలెస్ లో 98 సెకండ్లలో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల బుకింగ్ ఫుల్

SS Rajamouli RRR tickets at LAs Chinese Theatre sold out in just 98 seconds

  • చైనీస్ థియేటర్ లో ఈ నెల 9న స్క్రీనింగ్
  • హాజరు కానున్న రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి
  • నిమిషంన్నరలోనే 932 టికెట్ల విక్రయం

ఆర్ఆర్ఆర్ ఎక్కడా తగ్గనంటోంది. అమెరికాలోని లాజ్ ఏంజెలెస్ లో ఉన్న టీసీఎల్ చైనీస్ థియేటర్ లో ఈ నెల 9న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శనకు బుకింగ్ లు కేవలం 98 సెకండ్లలోనే పూర్తయిపోయాయంటే నమ్మగలరా? నమ్మాల్సిందే. నిమిషంన్నరలోనే 932 టికెట్లు సేల్ అయ్యాయి. ఈ నెల 9న ప్రదర్శించే షోకు దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరు కానున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్.

ఇక గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డులకు ఆర్ఆర్ఆర్ రెండు నామినేషన్లలో ఎంపిక కావడం తెలిసిందే. ఈ నెల 11న జరిగే ఈ కార్యక్రమానికి సైతం రాజమౌళి, తారక్, రామ్ చరణ్ హాజరుకానున్నారు. దీనికంటే రెండు రోజుల ముందు ‘బియాండ్ ఫెస్ట్’లో భాగంగా ఆర్ఆర్ఆర్ ను చైనీస్ థియేటర్ లో ప్రదర్శించనున్నారు. బియాండ్ ఫెస్ట్ తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఇంత వేగంగా టికెట్లు అమ్ముడు కావడం మరే భారతీయ సినిమా విషయంలోనూ సాధ్యం కాలేదు.

  • Loading...

More Telugu News