Santhosh Sobhan: అమ్మను హ్యాపీగా ఉంచడమే అసలైన సక్సెస్: హీరో సంతోష్ శోభన్

Santhosh Sobhan Interview

  • సంతోష్ శోభన్ హీరోగా 'కల్యాణం కమనీయం'
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ 
  • వరుస ఆఫర్ల పట్ల సంతోష్ ఆనందం 
  • ఈ నెల 14వ తేదీన విడుదలవుతున్న సినిమా

సంతోష్ శోభన్ ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఆయన 'కల్యాణం కమనీయం' అనే ఒక ఫ్యామిలీ ఎంటర్టయినర్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలే జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ .. "ఇంతవరకూ నా ప్రయత్న లోపం లేకుండా సిన్సియర్ గా కష్టపడుతూ వస్తున్నాను. ఏదో ఒకరోజున అనుకున్న స్థాయికి చేరుకుంటాననే ఒక నమ్మకం ఉంది. అలాంటి నమ్మకంతో చేసిన సినిమానే ఇది" అన్నాడు. 

"నాకు కొంచెం పేరు తెచ్చిపెట్టిన సినిమా 'పేపర్ బాయ్'. ఆ సినిమా తరువాత రెండేళ్లపాటు ఖాళీగా ఉన్నాను. కానీ ఈ మధ్య కాలంలో నేను బిజీగా ఉన్నాను. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. మా చిన్నప్పటి నుంచి మా కోసం కష్టపడిన అమ్మ రిలాక్స్ అయ్యేలా చూసుకుంటున్నాను. నా విషయంలో అమ్మ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అమ్మను ఆనందంగా ఉంచడమే అసలైన సక్సెస్ గా నేను భావిస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Santhosh Sobhan
Priya Bhavani Shankar
Kalyanam kamaneeyam Movie
  • Loading...

More Telugu News