Vijay: గ్రౌండ్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా ఆడియన్స్ చూసేది నన్నే: 'వారసుడు' ట్రైలర్ రిలీజ్

Varasudu Trailer Released

  • దిల్ రాజు బ్యానర్లో నిర్మితమైన 'వారసుడు'
  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టయినర్ 
  • ఇప్పటికే పాప్యులర్ అయిన తమన్ బీట్స్ 
  • ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా

తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి తెలియనిది కాదు. ఇక తెలుగులోనూ ఆయన మార్కెట్ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఆయన తెలుగు దర్శక నిర్మాతలతో ఒక సినిమా చేశాడు .. అదే 'వారసుడు'. దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తమిళ ... తెలుగు భాషల్లో ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరో ఉమ్మడి కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబం పాలిట విలన్ గా తయారవుతాడు ప్రకాశ్ రాజ్. అతన్ని ఎదిరించి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. 

విజయ్ సరసన నాయికగా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ .. సుమన్ .. ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్యామ్ .. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ నుంచి వచ్చిన పాటల్లో రంజితమే సాంగ్ బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే

Vijay
Rashmika Mandanna
Prakash Raj
Jayasudha
Varasudu Movie

More Telugu News