Chandrababu: కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి.. కాసేపట్లో చంద్రబాబు పర్యటన

High tension in Kuppam

  • కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో చంద్రబాబు ర్యాలీ
  • టీడీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
  • స్పృహతప్పి పడిపోయిన మహిళలు

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కాసేపట్లో ప్రారంభం కానుంది. నియోజకవర్గంలోని శాంతిపురంలో ర్యాలీకి, సభకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. సభలకు, ర్యాలీలకు అనుమతి లేదంటూ వైసీపీ ప్రభుత్వం నిన్న జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాబు సభకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. 

మరోవైపు కుప్పంకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల లాఠీఛార్జీలు కూడా చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. కొన్నిచోట్ల పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎత్తిపారేసి ఆందోళనకు దిగారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాసేపట్లో చంద్రబాబు పర్యటన ప్రారంభం కానున్న తరుణంలో ఏం జరుగుతుందో అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Chandrababu
Kuppam
ysr
Rally
  • Loading...

More Telugu News