Bengaluru: నా దుస్తులు విప్పించారు: బెంగళూరు ఎయిర్ పోర్టులో దారుణంపై మహిళ ఆవేదన

women asked to remove shirt in Bengaluru airport
  • ఎయిర్ పోర్టులో తనిఖీల సందర్భంగా దారుణం
  • మహిళ చొక్కాను విప్పించిన సెక్యూరిటీ సిబ్బంది
  • మండిపడుతున్న నెటిజెన్లు
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకు దారుణమైన అవమానం జరిగిందని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ తనిఖీల సందర్భంగా తన చొక్కాను విప్పించారని ఆమె ఆరోపించారు. సంగీత కళాకారిణి అయిన ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కాను తొలగించాలని అడిగారని ఆమె చెప్పారు. ఆ దారుణ పరిస్థితుల్లో తాను లోదుస్తులతో నిలుచున్నానని అన్నారు. ఇది తనకు చాలా అవమానకరమని చెప్పారు. బట్టలను తొలగించమని ఒక మహిళను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బాధితురాలు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది నిర్వాకాన్ని నెటిజెన్లు తప్పుపడుతున్నారు.
Bengaluru
Airport
women
Strip

More Telugu News