Prakash Raj: 'రంగమార్తాండ'లో రాఘవరావుగా ప్రకాశ్ రాజ్ .. కొత్త పోస్టర్ రిలీజ్!

Prakash Raj New Poster Released

  • కృష్ణవంశీ రూపొందించిన 'రంగమార్తాండ'
  • నాటకరంగం నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధానమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ 
  • ప్రత్యేకమైన పాత్రలో బ్రహ్మానందం 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

కృష్ణవంశీ కథల్లో కుటుంబ నేపథ్యం ఉంటుంది .. పాత్రల మధ్య ఘర్షణ .. సంఘర్షణ ఉంటాయి. అలాగే రొమాన్స్ ను ఆయన చూపించే కోణాన్ని చాలామంది ఇష్టపడతారు. ఫీల్ తోను .. ఎమోషన్ తోను కథను కనెక్ట్ చేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి కృష్ణవంశీ తాజా చిత్రంగా 'రంగమార్తాండ' రూపొందింది. 

రాజశ్యామల ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఒక రంగస్థల నటుడి జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. బ్రహ్మానందం ... ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు. భావోద్వేగాలతో ఈ కథ కదులుతూ ఉంటుంది. 

ఈ సినిమాలో రాఘవరావు అనే పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించారు. ఆ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. కథలో భాగంగా తనకి జరిగిన సన్మానం పట్ల ప్రకాశ్ రాజ్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prakash Raj
RamyaKrishna
Brahmanandam
Rangamarthanda Movie
  • Loading...

More Telugu News