Vijay: విజయ్ 'వారసుడు'లో శ్రీకాంత్ .. రోల్ ఏమిటంటే ..!

Varasudu Movie Update

  • వంశీ పైడిపల్లి రూపొందించిన 'వారసుడు'
  • దిల్ రాజు నుంచి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టయినర్ 
  • విజయ్ జోడీగా సందడి చేయనున్న రష్మిక 
  • విజయ్ కి అన్నయ్య పాత్రలో శ్రీకాంత్ 
  • ఈ నెల 12వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా  

శ్రీకాంత్ తనకి వచ్చిన అవకాశాలను బట్టి అప్పుడప్పుడు హీరోగా కనిపిస్తూ, మరోపక్క కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నాడు. 'అఖండ' సినిమాతో విలన్ గానూ మారే ప్రయత్నం చేశాడు. తన స్థాయికి తగిన పాత్రలను చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడటం లేదు. త్వరలో ఆయన విజయ్ సినిమా 'వారసుడు'లో కనిపించనున్నాడు.
 
ఈ సినిమాలో విజయ్ కి అన్నయ్య పాత్రను శ్రీకాంత్ పోషించాడు. ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ .. ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉండే కథ. విజయ్ మార్క్ యాక్షన్ తో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి. అందువలన హీరోకి అన్నయ్య పాత్రలో శ్రీకాంత్ పాత్రకి కూడా ప్రాధాన్యత ఉండనుంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో శ్రీకాంత్ స్వయంగా చెప్పాడు. 

 దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తమిళంలో 'వరిసు' పేరుతో అక్కడి ప్రేక్షకులను పలకరించనుంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శరత్ కుమార్ .,. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నారు.

Vijay
Rashmika Mandanna
Srikanth
Jayasudha
Varasudu Movie
  • Loading...

More Telugu News