Vidadala Rajini: చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం 40 మందిని బలితీసుకుంది: విడదల రజని

Vidadala Rajani fires on Chandrababu

  • చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదన్న మంత్రి 
  • జనాలను మభ్యపెట్టి సభలకు తీసుకొస్తున్నారని వ్యాఖ్య 
  • రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా చంద్రబాబుకు మద్దతుగా లేదన్న రజని 

టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు జనాలు స్వచ్ఛందంగా రావడం లేదని... ప్రజలను మభ్యపెట్టి సభలకు తీసుకెళ్తున్నారని మంత్రి విడదల రజని అన్నారు. జనాలను తరలించి భారీగా వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గుంటూరులో జరిగింది టీడీపీ కార్యక్రమం కాదు, ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం అని చంద్రబాబు ప్రకటించారని... కానీ, వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. 

రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా చంద్రబాబుకు అనుకూలంగా లేరని చెప్పారు. చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవంలో 40 మంది ప్రాణాలను బలితీసుకున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దని ఆయనకు సూచిస్తున్నామని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నామని... కొందరికి ఇంకా పరిహారం అందలేదని, వారికి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Vidadala Rajini
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News