naga showrya: నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్ విడుదల

Phalana Abhayi Phalana Ammayi first look reveals

  • శౌర్య సరసన హీరోయిన్ గా మాళవిక నాయర్
  • అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం
  • ఈ మధ్యే పెళ్లి చేసుకొని ఇంటివాడైన నాగశౌర్య 

ఈ జనరేషన్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరో నాగశౌర్య. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఈ మధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన నాగశౌర్య ఈ ఏడాది ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రంతో అలరించనున్నాడు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తనకు బ్రేక్ ఇచ్చిన హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంతో ఈ చిత్రం రూపొందుతోంది. మాళవిక నాయర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  

నాగశౌర్య, మాళవిక వింటర్ కోట్స్ ధరించి ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపిస్తున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం హీరో హీరోయిన్ల మధ్య సాగే పదేళ్ల ప్రేమ ప్రయాణం అని దర్శకుడు శ్రీనివాస్ చెప్పారు. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణం సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయని, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్,  దాసరి పద్మజ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణి మాలిక్, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు, విడుదల తేదీ గురించి తెలియాల్సి ఉంది.

naga showrya
malavika
new movie
firstlook
avasarala srinivas

More Telugu News