Chandrababu: 'కుండబద్దలు' సుబ్బారావు మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు, లోకేశ్

Chandrababu and Lokesh condolences to the demise of Kundabaddalu Subbarao

  • రాజకీయ విశ్లేషకుడు కాటా సుబ్బారావు మృతి
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినాయకత్వం
  • సుబ్బారావు మృతి విచారకరమన్న చంద్రబాబు
  • ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్

పల్నాడు జిల్లాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు, 'కుండబద్దలు' యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కాటా సుబ్బారావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. 

జర్నలిస్ట్ కాటా సుబ్బారావు మరణం విచారకరం అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషకునిగా బెదిరింపులకు, వేధింపులకు తలొగ్గక తన భావాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడం ద్వారా కుండబద్దలు సుబ్బారావుగా పేరు తెచ్చుకున్నారని వివరించారు. ఆయన ఉత్తమ జర్నలిజానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 

నారా లోకేశ్ స్పందిస్తూ, ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు కుండబద్దలు సుబ్బారావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News