KCR: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి కొత్త ఛైర్మన్

New chairmen for Telangana Sports Authority

  • టీఎస్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా ఈడిగ ఆంజనేయ గౌడ్
  • కేసీఆర్ నుంచి నియామకపత్రాలను అందుకున్న గౌడ్
  • గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేసిన అనుభవం 

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నియామకానికి సంబంధించిన పత్రాన్ని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా తనను స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మగా నియమించిన ముఖ్యమంత్రికి ఆంజనేయ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పాటైన తర్వాత 2016లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా ఆంజనేయగౌడ్ బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఉస్మానియా యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి, డాక్టరేట్ ను అందుకున్నారు.

KCR
BRS
Ediga Anjaneya Goud
Telangana Sports Authority
  • Loading...

More Telugu News