Myron Mohit: డ్రగ్స్ కేసులో హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త అరెస్ట్

Police arrests heroine Neha Deshpande husband Myron Mohit

  • కొంతకాలం కిందట ఎడ్విన్ అరెస్ట్ తో తెరపైకి డ్రగ్స్ వ్యవహారం
  • తాజాగా మైరాన్ మోహిత్, కృష్ణకిశోర్ రెడ్డి అరెస్ట్
  • సినీ ప్రముఖులతోనూ మైరాన్ కు పరిచయాలు
  • మైరాన్ ద్వారా వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సప్లై చేస్తున్న కృష్ణకిశోర్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ భామ నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో మైరాన్ తో పాటు, హైదరాబాదుకు చెందిన బిజినెస్ మేన్ కృష్ణకిశోర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మైరాన్ మోహిత్ దేశంలో ప్రముఖ డీజేగా, ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ గా గుర్తింపు పొందాడు. దేశంలో అనేక చోట్ల డీజే పార్టీలు, ఈవెంట్లు నిర్వహించే మైరాన్... డీజే ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నట్టు గుర్తించారు. గత 12 ఏళ్లుగా అతడు డ్రగ్స్ సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. 

టాలీవుడ్ నటి నేహా దేశ్ పాండేను పెళ్లాడిన మైరాన్ ముంబయి కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి పలు భాషల సినీ పరిశ్రమల్లోని వ్యక్తులతోనూ, వ్యాపారవేత్తలతోనూ పరిచయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. మైరాన్ ను పోలీసులు హైదరాబాదులోని ఓ పబ్ లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

ఇక, కృష్ణకిశోర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు చేపడుతున్నారు. ఎడ్విన్, మైరాన్ మోహిత్ లతో పరిచయం పెంచుకున్న కృష్ణకిశోర్ రెడ్డి వారి ద్వారా ఇతర వ్యాపారవేత్తలకు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు.

Myron Mohit
Drugs Case
Neha Deshpande
Actress
  • Loading...

More Telugu News