Malavika Sharma: అందాల చందమామ .. మాళవిక శర్మ: లేటెస్ట్ పిక్స్

- ఆకర్షణీయమైన రూపం మాళవిక శర్మ సొంతం
- 'నేల టిక్కెట్టు' సినిమాతో తెలుగు తెరకి పరిచయం
- 'రెడ్' ఫలితం కూడా నిరాశ పరచడంతో తగ్గిన అవకాశాలు
- గ్లామర్ పరంగా వంకబెట్టనవసరం లేని బ్యూటీ
- అదృష్టం కోసం అందాల భామ వెయిటింగ్
కొంతమంది కథానాయికలకు తొలి సినిమాతోనే హిట్ పడుతుంది. రెండో సినిమాతోనే క్రేజ్ పెరుగుతుంది. ఇక కృతి శెట్టి మాదిరిగా మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టినవారు కూడా ఉన్నారు. కానీ మరికొంతమంది కథానాయికల విషయంలో సక్సెస్ అనేది ముఖం చాటేస్తూ ఉంటుంది. అలా సక్సెస్ కి దూరంగా ఉన్న హీరోయిన్స్ లో మాళవిక శర్మ ఒకరుగా కనిపిస్తుంది.

చూడటానికి మాళవిక దాన్నిమ్మ మొగ్గలా ఉంటుంది. చక్కని కనుముక్కుతీరుతో ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే 'నేల టిక్కెట్టు' .. 'రెడ్' సినిమా ఫ్లాపుల కారణంగా, అవకాశాలు ఆమె వైపు వెళ్లడం లేదు. అయినా ఆమె ప్రయత్నాలు మానలేదు. లేటెస్ట్ గా వదిలిన పిక్స్ లో ఆమె అందాల చందమామ మాదిరిగానే కనిపిస్తోంది. రామ్ .. నితిన్ .. నాగశౌర్య వంటి హీరోల జోడీగా ఈ బ్యూటీ సెట్ అవుతుందనిపిస్తుంది. ఈ ఏడాదిలోనైనా ఈ అందానికి అదృష్టం తోడవుతుందేమో చూడాలి మరి.
