Anupama: బయట నేను ఎలా ఉంటానంటే ..!: అనుపమ పరమేశ్వరన్

Anupama Interview

  • క్రితం ఏడాది రెండు హిట్లు అందుకున్న అనుపమ 
  • సింపుల్ గా ఉండటం తన నైజమని వెల్లడి
  • ఇష్టమైనవి తినేస్తానని చెప్పిన అనుపమ 
  • పాజిటివ్ గా ఆలోచించడమే అలవాటని వివరణ

యంగ్ హీరోల జోడీగా కుదురుగా కనిపించే ఆకర్షణీయమైన రూపం అనుపమ పరమేశ్వరన్ సొంతం. సాయిపల్లవి మాదిరిగానే ఇటు గ్లామర్ పరంగాను ... అటు నటన పరంగాను ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆమె కనెక్ట్ అయింది. ఆమె ఎంచుకునే కథలు కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే ఉంటాయి. క్రితం ఏడాది ఆమె నుంచి 'కార్తికేయ 2' .. '18 పేజెస్'లతో సక్సెస్ లను అందుకుంది. 

తాజాగా ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ .. '18 పేజెస్' కథను పల్నాటి సూర్యప్రతాప్ గారు కొంతసేపు చెప్పగానే నాకు నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలనే నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో నేను పోషించిన 'నందిని' పాత్ర ఇంత బాగా రావడానికి కారణం, సుకుమార్ గారు .. సూర్యప్రతాప్ గారు. 

"ఇకముందు కూడా డిఫరెంట్ రోల్స్ చేయాలనే అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా నేను ఇలాగే ఉంటున్నానని అంటున్నారు. నిజానికి నాకు ఏది ఇష్టమనిపిస్తే అది తినేస్తాను. బయట నేను చాలా సింపుల్ గా ఉంటాను. పాజిటివ్ గా ఆలోచించడం .. ప్రశాంతంగా ఉండటం నాకు అలవాటు" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News