Rashmika Mandanna: వాళ్లకి రష్మిక కూడా పెద్ద కౌంటర్ వేసేసింది!

Rashmika Special

  • స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక
  • రిషబ్ శెట్టితో తలెత్తిన మనస్పర్థలు 
  • ఇద్దరి కాంబిషన్లో వచ్చిన 'కిరాక్ పార్టీ'
  • ఆరేళ్లను పూర్తి చేసుకున్న సినిమా 
  • ఒకరిని ఒకరు పట్టించుకోకుండానే ట్వీట్లు

తెలుగు .. కన్నడ భాషల్లో రష్మిక స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. ఇక తమిళ .. హిందీ భాషల్లోను అదే రేంజ్ ను అందుకోవటానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. చకచకా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళుతుందనుకున్న రష్మిక, రిషబ్ శెట్టితో కయ్యం తెచ్చుకుంది. రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయవచ్ఛనే టాక్ కూడా వచ్చేసింది. 

అలాంటిదేం జరగదని రష్మిక చెప్పడం .. ఆమెతో మాత్రం యాక్ట్ చేయనని రిషబ్ శెట్టి అనడం ఇలా ఒక చిన్నపాటి వార్ జరిగింది. నెమ్మదిగా ఈ వ్యవహారం మరుగున పడుతుందని అనుకుంటే, మళ్లీ రాజుకున్నట్టే కనిపిస్తోంది. రక్షిత్ శెట్టి - రష్మిక జంటగా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన 'కిరాక్ పార్టీ' ఆరేళ్ల ను పూర్తిచేసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ కి రిషబ్ శెట్టి థ్యాంక్స్ చెబుతూ ట్యాగ్ చేశాడు. కానీ రష్మికను మాత్రం వదిలేశాడు. ఇక హీరో రక్షిత్ శెట్టి కూడా ట్వీట్ చేశాడుగానీ, రష్మికను పట్టించుకోలేదు. దాంతో తానేం తక్కువ తినలేదంటూ, రష్మిక కూడా ఈ సినిమా ఆరేళ్లను పూర్తిచేసుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది తప్ప, హీరోనుగానీ .. డైరెక్టర్ ను గాని ట్యాగ్ చేయలేదు. మొత్తానికి కోల్డ్ వార్ నడుస్తూనే ఉందని అక్కడ అంతా చెప్పుకుంటున్నారు..

Rashmika Mandanna
Rishbh Shetty
Rakshith Shetty
  • Loading...

More Telugu News