gas: మళ్లీ పెరిగిన వాణిజ్య వంట గ్యాస్ ధర

commercial cylinder price increased

  • వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 25 వడ్డింపు
  • పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి
  • గృహావసర సిలిండర్ ధరలో మార్పు లేని వైనం

కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులకు చేదువార్త. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ రేటు పెరిగింది. తాజాగా మరో  రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1768 కి చేరుకుంది.

చెన్నైలో అత్యధికంగా రూ.1917 ధర ఉంది. కోల్‌కతాలో రూ.1870కి చేరుకుంది. ముంబైలో రూ.1721కి పెరిగింది. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం దీని ధర రూ.1105గా ఉంది.

gas
commercial cylinder
price
India
increase
  • Loading...

More Telugu News