: వేడుకగా జరిగిన 'బలుపు' ఆడియో విడుదల


హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో 'బలుపు' ఆడియో రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ, రవితేజ స్వయం కృషితో పైకి వచ్చాడని, అందుకే అతనంటే తనకిష్టమనీ అన్నారు. అలాగే దర్శకులు, హీరోల కబంధహస్తాల్లో మన సినిమా చిక్కుకుపోయిందనీ, దాన్నుంచి సినీరంగాన్ని బయటపడెయ్యాలని ఆశిస్తున్నానన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో రవితేజ అద్భుతంగా నటించాడని అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతిసినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడని, ఈ సినిమా మంచి హిట్ కావాలని అభిలషించారు. ఈ సినిమా ట్రైలర్ బావుందని, సినిమా అంతకంటే బాగుంటుందని రవితేజ అన్నారు. తనను ఇంతలా అభిమానిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 'సినిమా బాగుంటుంది, ధియేటర్లలో చూడండి' అన్నారు. ఈ కార్యక్రమానికి పసందైన వ్యాఖ్యానంతో సుమ, శ్రీనివాస రెడ్డిలు అలరించారు.

  • Loading...

More Telugu News