Balakrishna: 'వీరసింహారెడ్డి'కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచేది అదే!

Veera Simha Reddy Movie Update

  • 'వీరసింహా రెడ్డి'గా కనిపించనున్న బాలయ్య
  • ఆయన చేసిన ఫ్యాక్షన్ సినిమాల్లో ఇది ఒకటి  
  • ఆయన సరసన నాయికగా అలరించనున్న శ్రుతిహాసన్ 
  • గోపీచంద్ మలినేనితో ఆమెకి మూడో సినిమా 
  • ఈ నెల 12న వస్తున్న వీరసింహారెడ్డి'

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోని కథలకు నాయకుడు బాలకృష్ణనే. ఈ నేపథ్యంలో కథలను కొంతమంది హీరోలు చేసినప్పటికీ, బాలకృష్ణకి మాత్రమే బాగా సెట్ అయ్యాయి అనే అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. కొంత గ్యాప్ తరువాత ఆయన అదే జోనర్లో చేసిన సినిమానే 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. 

బాలకృష్ణలో ఉన్న ఎనర్జీ అప్పటికీ .. ఇప్పటికీ అదే రేంజ్ లో కనిపిస్తూ వచ్చింది. మాస్ డాన్స్ లలో ఆయన తన సత్తాను చాటుతూనే ఉన్నారు. తన క్రేజ్ ను కొనసాగిస్తూనే వస్తున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలలో సరైన హీరోయిన్స్ పడటం లేదు. అంజలి ... సోనాల్ చౌహన్ .. ప్రగ్యా జైస్వాల్ .. అడపా దడపా కొత్త హీరోయిన్లతోను దర్శకులు సరిపెడుతూ వచ్చారు. ఇలా బాలయ్య హీరోయిన్స్ విషయంలో ఫ్యాన్స్ కి ఒక అసంతృప్తి ఉంటూ వచ్చింది. 

'వీరసింహారెడ్డి' సినిమా విషయంలో మాత్రం అలాంటి అసంతృప్తి లేదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతిహాసన్. 'బలుపు' .. 'క్రాక్' వంటి హిట్లు ఇచ్చిన కారణంగా ఆమె గోపీచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలయ్య జోడీగా ఆమెను చూడటానికి కుర్రాళ్లు ఉత్సాహ పడుతున్నారు. ఈ జంట వేసే మాస్ స్టెప్పులను ఎంజాయ్ చేసే సమయం కోసం వాళ్లంతా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి గల ప్రత్యేకమైన ఆకర్షణలలో శ్రుతి హాసన్ ఎంపిక ఒకటి అనేది మాత్రం వాస్తవం.

Balakrishna
Sruthi Haasan
Veerasimha Reddy Movie
  • Loading...

More Telugu News