Hardik Pandya: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పాండ్యా బ్రదర్స్

Pandya brothers met Amit Shah

  • హార్దిక్, కృనాల్ పాండ్యాలను ఆహ్వానించిన అమిత్ షా
  • అమిత్ షా నివాసానికి వెళ్లిన పాండ్యా బ్రదర్స్
  • ట్విట్టర్ లో వెల్లడించిన హార్దిక్ పాండ్యా

టీమిండియా టీ20 జట్టు సారథి హార్దిక్ పాండ్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి అమిత్ షా నివాసానికి వెళ్లినట్టు హార్దిక్ పాండ్యా ట్విట్టర్ లో వెల్లడించాడు. తమను ఆహ్వానించడమే కాకుండా, ఎంతో విలువైన సమయాన్ని తమతో గడిపారంటూ అమిత్ షాకు హార్దిక్ పాండ్యా కృతజ్ఞతలు తెలిపాడు. మిమ్మల్ని కలవడాన్ని ఎంతో గౌరవంగా, గొప్పగా భావిస్తున్నామని పేర్కొన్నాడు. ఈ మేరకు అమిత్ షాతో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా పాండ్యా ట్విట్టర్ లో పంచుకున్నాడు. 

కాగా, శ్రీలంకతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్ లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ జనవరి 3న ప్రారంభం కానుంది.

Hardik Pandya
Krunal Pandya
Amit Shah
Team India
  • Loading...

More Telugu News