Devisri Prasad: సంక్రాంతి సందడిలో అటు తమన్ .. ఇటు దేవిశ్రీ ప్రసాద్

Sankranthi Movies Special

  • సంక్రాంతి బరిలో భారీ సినిమాలు 
  • 'వీరసింహారెడ్డి' సంగీత దర్శకుడిగా తమన్ 
  • 'వాల్తేరు వీరయ్య'కి బాణీలు కట్టిన దేవిశ్రీ 
  • ఇప్పటికే జనంలోకి వెళ్లిన మాస్ బీట్స్   

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా చాలా కాలం నుంచి తమన్ .. దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఎవరికి వారు ఎప్పటికప్పుడు తమ బాణీలతో కొత్త విన్యాసాలు చేయిస్తున్నారు. మాస్ బీట్స్ ను కంపోజ్ చేయడంలోను .. ఐటమ్ సాంగ్స్ చేయటంలోను ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. ఈ విషయాన్ని ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు నిరూపిస్తూ వస్తున్నారు. 

తమన్ బీట్స్ .. దేవిశ్రీ స్వరాల మధ్య ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు పోలిక పెడుతూనే వస్తున్నారు. అయితే ఈ సారి ఇటు తమన్ సంగీతాన్ని అందించిన 'వీరసింహారెడ్డి' .. అటు దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికే వస్తున్నాయి. ఒకరోజు తేడాతో ఈ రెండు సినిమాలు థియేటర్లలో దిగనున్నాయి.

బాలయ్య 'వీరసింహారెడ్డి' ... చిరూ 'వాల్తేరు వీరయ్య' ఈ రెండు సినిమాలు కూడా మాస్ యాక్షన్ జోనర్లో నడిచేవే. అందువలన మాస్ సాంగ్స్ పాళ్లు ఎక్కువ. ఆ దిశగా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ గట్టి కసరత్తు చేసినట్టుగా తెలుస్తూనే ఉంది. మరి ఈ సంక్రాంతి పండుగకి ఎవరు ఎక్కువగా సందడి చేయనున్నారనేది చూడాలి..

Devisri Prasad
Thaman
Veerasimha Reddy
Waltair Veerayya
  • Loading...

More Telugu News