Singireddy Niranjan Reddy: టీపీసీసీ అధ్యక్షుడివా? లేక కేంద్రానికి వంతపాడుతున్నావా?: రేవంత్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

Niranjan Reddy fires on Revanth Reddy

  • రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ
  • పత్తికి మద్దతు ధర లేదని విమర్శ  
  • మద్దతు ధర కేంద్రం పరిధిలో విషయమన్న నిరంజన్ రెడ్డి

తెలంగాణలో పత్తి రైతులు మద్దతు ధర లేక రోడ్డెక్కారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం తెలిసిందే. పత్తి క్వింటాలు రూ.15 వేల ధర లేనిదే రైతులకు గిట్టుబాటు కాదని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. నువ్వు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడివా? లేక కేంద్రానికి వంతపాడుతున్నావా? అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పత్తి గిట్టుబాటు ధర రాష్ట్రం పరిధిలో ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా, సీఎంకు లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మాట తప్పిన కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశావా? అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Singireddy Niranjan Reddy
Revanth Reddy
KCR
Farmers
BRS
Congress
Telangana
  • Loading...

More Telugu News