Pope Benedict: మాజీ పోప్ బెనెడిక్ట్ అస్తమయం

Ex Pope Benedict passes away

  • అనారోగ్యంతో కన్నుమూసిన పోప్ బెనెడిక్ట్
  • ఆయన వయసు 95 సంవత్సరాలు
  • ఈ ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారన్న వాటికన్ సిటీ

రోమన్ క్యాథలిక్కుల మత గురువు మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్టు వాటికన్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బెనెడిక్ట్ వయసు 95 సంవత్సరాలు. కొన్ని రోజులుగా బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హృద్రోగ సమస్యతో పాటు ఇతర వ్యాధులకు కూడా చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం 9.30 గంటలకు ప్రాణాలు వదిలినట్టు వాటికన్ సిటీ ప్రతినిధులు వెల్లడించారు. జనవరి 2 నుంచి సెయింట్ పీటర్స్ బేసిలికా వద్ద పోప్ భౌతికకాయాన్ని ఉంచుతామని తెలిపారు. పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను మరికొన్ని గంటల్లో ప్రకటిస్తామని చెప్పారు.

Pope Benedict
Dead
  • Loading...

More Telugu News