Kiara Advani: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా అద్వానీ

Kiara Advani and Sidharth Malhotra to get married

  • ప్రియుడు, బాలీవుడ్ హీరోను పెళ్లాడబోతున్న కియారా
  • జైసల్మేర్ లోని ప్యాలెస్ హోటల్ లో ఫిబ్రవరి 6న పెళ్లి
  • 2020 నుంచి ప్రేమలో ఉన్న కియారా, సిద్ధార్థ్

అందాల భామ కియారా అద్వానీ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడబోతోంది. వీరి వివాహం ఫిబ్రవరి 6న జరగబోతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఉన్న ప్యాలెస్ హోటల్ లో వివాహ వేడుక జరగబోతోంది. 

ఇక ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. 2020 నుంచి కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు డేటింగ్ లో ఉన్నారు. మహేశ్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' ద్వారా టాలీవుడ్ లోకి కియారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించింది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

Kiara Advani
Sidharth Malhotra
Marriage
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News