panth: పంత్ కారు ప్రమాదం జరిగిందిలా.. వీడియో ఇదిగో!

pant car accident video futage in social media
  • టోల్ గేట్ దగ్గర సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ప్రమాద దృశ్యాలు
  • వేగంగా దూసుకొచ్చి ఫుట్ పాత్ ను ఢీ కొట్టిన పంత్ మెర్సిడెస్ కారు
  • మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయిన కారు
క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఆపై మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. న్యూ ఇయర్ సందర్భంగా తల్లిని సర్ ప్రైజ్ చేయాలని పంత్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ దగ్గర సీసీటీవీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. 

వేగంగా దూసుకొచ్చిన పంత్ కారు డివైడర్ ను ఢీ కొట్టుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆపై మంటల్లో తగలబడుతున్న కారును అక్కడి వాహనదారులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మంటల్లో కాలిపోతున్న పంత్ కారు, గాయపడిన పంత్ కు స్థానికులు సాయంచేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.
panth
Cricketer
indian wicket keeper
panth accident
panth car accident

More Telugu News