Pragna Reddy: పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి లేఖకు స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu responds to Pragna Reddy letter

  • 2014లో ఏక్ నాథ్ రెడ్డిని పెళ్లాడిన ప్రజ్ఞారెడ్డి
  • కాపురంలో తలెత్తిన కలతలు
  • అప్పట్లో పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు
  • ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి లేఖ
  • తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణ  

పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపడం తెలిసిందే. తన మామ జి.రాఘవరెడ్డి, అత్త భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీదివ్య రెడ్డి తనను, తన కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వారి నుంచి తనను కాపాడాలంటూ ఆమె రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపథ్యంలో, ప్రజ్ఞారెడ్డి లేఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డి వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ ను ఆదేశించారు. 

జి.రాఘవరెడ్డి కుమారుడు ఏక్ నాథ్ రెడ్డితో ప్రజ్ఞారెడ్డి వివాహం 2014లో జరిగింది. అయితే వీరి కాపురంలో కలతలు రావడంతో ప్రజ్ఞారెడ్డి గతంలో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ప్రజ్ఞారెడ్డి తన గదిలో ఉండగా, ఆమె బయటికి రాకుండా రాత్రికి రాత్రే గోడ నిర్మించడం సంచలనం సృష్టించింది.

Pragna Reddy
Droupadi Murmu
President Of India
  • Loading...

More Telugu News